: మంత్రి ప్రత్తిపాటి, డొక్కా మధ్య ఎస్సీ వర్గీకరణ వివాదం


ఏపీ ప్రభుత్వానికి ఎస్సీ వర్గీకరణ చేసే ఆలోచన లేదంటూ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడడంపై టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఈ విషయంపై ప్రత్తిపాటి అన్నీ తెలుసుకుని అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఓ వైపు సామాజిక న్యాయం కోసం సీఎం చంద్రబాబు కష్టపడుతుంటే మంత్రులు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదని గుంటూరులో మీడియాతో అన్నారు. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని, ఇలాంటి అసంబద్ధ వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీస్తాయని చెప్పారు. తనకు కేటాయించిన శాఖపై పుల్లారావు దృష్టి సారించాలన్నారు. అసలు ఎస్సీ వర్గీకరణ అంశం చాలా చిన్నదని, తనకా పని అప్పగిస్తే 24 గంటల్లో పరిష్కరిస్తానని డొక్కా పేర్కొన్నారు. రేపు మంద కృష్ట, ఇతర మాదిగ నేతలతో సమావేశమై ఈ విషయంపై చర్చిస్తానన్నారు. మరోవైపు మంత్రి ప్రత్తిపాటి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతలలోని సెయింట్ జోసఫ్ పాఠశాల పక్కన ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు హల్ చల్ చేశాడు. 24 గంటల్లో మంత్రి క్షమాపణ చెప్పాలని, లేకుంటే టవర్ పై నుంచి దూకేస్తానని బెదిరించాడు. అతనిని కిందకు దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News