: నెమలి మన జాతీయ పక్షి... దాన్నెలా వెర్మిన్ జాబితాలో ఉంచుతాం?: గోవా సీఎం
గోవాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంటలను నెమళ్లు భారీగా నష్టపరుస్తున్నాయన్న ఫిర్యాదులతో, వాటిని వెర్మిన్ జాబితాలో చేరుస్తామంటూ ఇటీవల ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి చేసిన ప్రకటనపై దుమారం రేగింది. దాంతో నెమళ్లను ఆ జాబితాలో చేర్చడం దారుణమంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. తాజాగా ఆ ఆరోపణలను ఆ రాష్ట్ర సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ ఖండించారు. నెమలి వెర్మిన్ జాబితాలో ఉందని తాననుకోవడం లేదన్నారు. అది మన జాతీయ పక్షి అని, దాన్నెలా పంటలకు హాని కలిగించే (వెర్మిన్) జాబితాలో చేరుస్తామని అన్నారు. పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలు తినడానికి మాత్రమే అవి వస్తాయని, పంటను పాడు చేయవని చెప్పారు. అయినప్పటికీ ఫిర్యాదులు వస్తే నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని పర్సేకర్ స్పష్టం చేశారు.