: చొరబాట్లను తిప్పికొట్టిన సైన్యం... కుప్వారాలో నలుగురు ఉగ్రవాదుల హతం


దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన యత్నాలు ఫలించలేదు. నేటి ఉదయం జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా పరిధిలోని నియంత్రణ రేఖను దాటుకుని దేశంలోకి అడుగుపెట్టేందుకు వచ్చిన ఉగ్రవాదులను సైన్యం అడ్డుకుంది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. తొలుత కాస్తంత పైచేయి సాధించిన ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను చంపేశారు. ఆ తర్వాత ఉగ్రవాదులపై సైన్యం భీకర దాడులకు దిగింది. సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇదిలా ఉంటే, పూంచ్ సెక్టార్ లో పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ ఏజెంట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News