: గుడిసెల తొలగింపుపై మోదీ సతీమణి గుస్సా... ముంబైలో నిరాహార దీక్ష


మురికివాడల్లో పేదలు వేసుకున్న గుడిసెల తొలగింపు నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సతీమణి జసోదా బెన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె నిన్న ముంబైలో నిరాహార దీక్షకు దిగారు. పేదల గుడిసెల తొలగింపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ముంబైలోని మురికివాడల్లో తాత్కాలిక నివాసాలను తొలిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ‘గుడ్ సమారిటన్ మిషన్ ట్రస్ట్’ చేపట్టిన దీక్షకు జసోదా బెన్ మద్దతు పలికారు. ఇందులో భాగంగా నిన్న ముంబైలో జరిగిన దీక్షలో ఆమె ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News