: అరెస్ట్ చేయబోం!... నోటీసుల్లో మత్తయ్యకు హామీ ఇచ్చిన టీ ఏసీబీ


ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్యకు జారీ చేసిన నోటీసుల్లో తెలంగాణ ఏసీబీ అధికారులు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసు వెలుగు చూసిన వెంటనే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మత్తయ్య ఏపీకి తరలివెళ్లారు. అక్కడి నుంచే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని తన అరెస్ట్ ను నిలువరించుకున్నారు. ఆ తర్వాత కానీ ఆయన హైదరాబాదులో అడుగుపెట్టలేదు. తాజాగా నిన్న ఈ కేసు ఫైలు బూజు దులిపిన టీ ఏసీబీ, విచారణకు హాజరుకావాలంటూ ఉప్పల్ లోని మత్తయ్యకు నోటీసులు జారీ చేసింది. విచారణకు పిలిచి ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయంతో మళ్లీ మత్తయ్య ఏపీ పారిపోవచ్చని భావించిన ఏసీబీ అధికారులు... ఆ నోటీసుల్లో ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేయబోమని ఏసీబీ మత్తయ్యకు హామీ ఇచ్చింది. అంతేకాక న్యాయవాదితో కలిసి విచారణకు రావచ్చని కూడా ఆయనకు తెలిపింది.

  • Loading...

More Telugu News