: ‘ఫ్రీ బేసిక్స్’ ఎఫెక్ట్!... ఫేస్ బుక్ హెడ్డాఫీస్ కు ఇండియా చీఫ్ కార్తీక రెడ్డి బదిలీ


భారత నెటిజన్లను చెప్పు చేతల్లోకి తీసుకునేందుకు ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకెర్ బర్గ్ ప్రతిపాదించిన ‘ఫ్రీ బేసిక్స్’కు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటి రెడ్ సిగ్నల్ వేసింది. దీంతో షాక్ తిన్న జుకెర్ బర్గ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఫేస్ బుక్ ఇండియా చీఫ్ గా పనిచేస్తున్న కార్తీక రెడ్డితో ఆ పదవికి రాజీనామా చేయించారు. దీంతో త్వరలోనే ఆమె అమెరికాలోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలివెళ్లనున్నారు. భారత్ లో ఫేస్ బుక్ విస్తరణలో కార్తీక రెడ్డి పాత్రే కీలకం. వేలల్లో ఉన్న భారత ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్యను ఆమె లక్షల సంఖ్యలోకి తీసుకెళ్లారు. తత్ఫలితంగా దేశంలో ఒక్క ఫేస్ బుక్ మాత్రమే కాక సోషల్ మీడియా రంగం శరవేంగంగా వృద్ధి చెందింది. తాజాగా ఫేస్ బుక్ ఫ్రీ బేసిక్స్ కు భారత్ లో ద్వారాలు మూసుకుపోవడంతో ఇక లాభం లేదనుకున్న జుకెర్ బర్గ్, సత్తా కలిగిన కార్తీక రెడ్డిని అమెరికా తీసుకెళ్లిపోవడానికే మొగ్గుచూపారు. ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించనప్పటికీ, ఆ పోస్టులో సత్తా కలిగిన ఉద్యోగినే నియమించేందుకు జుకెర్ బర్గ్ యత్నిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News