: ‘కేర్’ తీసుకోమంటే... చితగ్గొట్టేసింది!: 94 ఏళ్ల అల్జీమర్స్ పేషంట్ పై కేర్ టేకర్ ఘాతుకం, వీడియో వైరల్
వయసు మీద పడ్డ తల్లి... ఆపై అల్జీమర్స్ తో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకు ఓ యువతి కేర్ టేకర్ ను నియమించుకుంది. ఒప్పందం మేరకు డబ్బు తీసుకుని ముసలావిడను బాగా చూసుకోవాల్సిన ఆ కేర్ టేకర్ ఏం చేసిందో... తెలుసా? కదల్లేని స్థితిలో ఉన్న ఆ ముసలావిడను చితక్కొట్టింది. చేతులతో నెత్తిపై ఠపీ ఠపీమని కొట్టడమే కాక కాళ్లతో తన్నేసింది. కాళ్లు కదలలేకున్నా, కాస్తంత చలనం ఉన్న చేతులతో ఆ ముసలావిడ అడ్డు చెప్పబోతే, ఆ కేర్ టేకర్ ఆగ్రహోదగ్రురాలైంది. లేచి నిలబడి ఆ ముసలావిడను ఎత్తి కుదేసింది. తర్వాత ఇంటికి వచ్చిన ఆ ముసలావిడ కూతురుకు ఎందుకనో అనుమానం వచ్చింది. సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేసింది. ఈ కెమెరాలో ఆ కేర్ టేకర్ ఘాతుకం రికార్డైంది. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో రికార్డైనట్లుగా భావిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.