: టీమిండియా @ 110/1
జార్ఖండ్ రాజధాని రాంచీ వేదికగా జరుగుతున్న రెండో టీట్వంటీలో టీమిండియా టాపార్డర్ అద్భుతంగా రాణించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (51), రోహిత్ శర్మ (42) రాణించడంతో భారత జట్టు పదకొండో ఓవర్ లో సెంచరీ మార్కును దాటింది. క్రీజులో కుదురుకున్న ధావన్ ప్రయోగాత్మక షాట్లతో అలరించాడు. చివరికి అలాంటి షాట్ కోసమే ప్రయత్నించి కీపర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు కూడా. అనంతరం రోహిత్ శర్మకు అజింక్యా రహానే (18) జత కలిశాడు. ఆచితూచి ఆడుతూనే గతి గప్పిన బంతులను బౌండరీ లైన్ దాటించాడు. అవుట్ ఫీల్డ్ పై బంతి వేగంగా ఉండడంతో, బంతి ఫీల్డర్ ను దాటితే కనుక బౌండరీ లైన్ ను తాకుతోంది. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది. రోహిత్ 43 పరుగులతోనూ, రహానే 24 పరుగులతోను క్రీజులో ఉన్నారు. చమీర ఒక వికెట్ తీసి రాణించాడు.