: ప్రేమికులకు రక్షణ కల్పించాలి: ఇండియన్ లవర్స్ యూనిటీ
వాలెంటైన్స్ డే నాడు ప్రేమికులకు రక్షణ కల్పించాలని 'ఇండియన్ లవర్స్ యూనిటీ' హైదరాబాద్ నగర అడిషనల్ పోలీసు కమిషనర్ ను కలిసి, విజ్ఞప్తి చేసింది. ప్రేమికులను హెచ్చరిస్తున్న వీహెచ్ పీ, భజరంగ్ దళ్ నేతలను ముందస్తుగా అరెస్టు చేయాలని ఆ వినతిపత్రంలో కోరింది. ప్రేమికుల రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉస్మానియా యూనివర్శిటీలో వాలెంటైన్స్ డే సభ ను నిర్వహించునున్నట్లు ఇండియన్ లవర్స్ యూనిటీ పేర్కొంది. కాగా, వాలెంటైన్స్ డే అనేది బహుళజాతి సంస్థల కుట్ర అని భజరంగ్ దళ్, వీహెచ్ పీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రేమికుల రోజును ఎవరూ ప్రోత్సహించవద్దని వారు కోరారు. ప్రేమికుల రోజు నాడు పార్కుల్లో ప్రేమికులు ఎవరైనా కనిపిస్తే వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించి, వారి తల్లిదండ్రులకు అప్పగిస్తామని వారు హెచ్చరించిన విషయం తెలిసిందే.