: రోహిత్, ధావన్ కుదురుకున్నారు...6 ఓవర్లు 70 పరుగులు


రాంచీ టీట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కుదురుకున్నారు. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సొంత నగరంలో ప్రారంభమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అయితే, తొలి టీట్వంటీలో ఘోర వైఫల్యం చెందిన రోహిత్ ఈసారి మాత్రం లంక బౌలర్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. తొలి బంతినే బౌండరీకి తరలించి తన ఉద్దేశం ఏమిటో చాటి చెప్పాడు. తరువాతి ఓవర్లో సిక్స్ బాది ధావన్ తన లక్ష్యాన్ని సూచించాడు. దీంతో లంక బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు సంధించినప్పటికీ టీమిండియా తురుపుముక్కల ముందు వారి ఆటలు సాగలేదు. దీంతో ఆరు ఓవర్లు ఆడిన భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 70 పరుగులు చేసింది. 14 బంతుల్లో రోహిత్ 19 పరుగులు చేయగా, 21 బంతులాడిన ధావన్ 44 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News