: చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి షురూ!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం త్వరలో జరగనుండటంతో వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైనట్లు సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పసుపు కుంకుమ వేడుకతో పెళ్లి పనులను నిన్న ప్రారంభించారని, మెగా ఫ్యామిలీ నుంచి ఈ వివాహానికి సంబంధించిన ఒక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. చిత్తూరుకు చెందిన ఒక ఎన్ఆర్ఐతో శ్రీజ వివాహం జరగనుందని, వరుడి కుటుంబం చిరంజీవి కుటుంబానికి సన్నిహితమని చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితమే అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం వేడుక జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పవన్ కల్యాణ్ సహా ‘మెగా’ కుటుంబం సభ్యులంతా పాల్గొన్నారని, మార్చి చివరి వారంలో ఈ వివాహం జరుగుతుందని తెలుస్తోంది. కాగా, హైదరాబాద్ కు చెందిన శిరీష్ భరద్వాజ్ ను శ్రీజ గతంలో ప్రేమ వివాహం చేసుకుంది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో శిరీష్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.