: అసెంబ్లీ రికార్డుల్లో నేను తిట్టినట్టు లేదు...ఆ టేపులు వారి కల్పన: రోజా


అసెంబ్లీ రికార్డుల్లో తాను ఎవరినీ తిట్టినట్టు లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అధికార పక్షం విడుదల చేసిన వీడియో క్లిప్పింగ్స్ లోని సన్నివేశాలు ఎడిట్ చేసినవని ఆమె చెప్పారు. ఈ వీడియో పుటేజ్ లు లీక్ చేయడంపై అసెంబ్లీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరనున్నామని ఆమె తెలిపారు. అలాగే ఈ వీడియో రూపొందించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని ఆమె పేర్కొన్నారు. దేశంలోని ప్రతి అసెంబ్లీలో స్లోగన్ లు ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని ఆమె చెప్పారు. తాను కూడా అలా నినాదాలు చేశానని ఆమె అన్నారు. తానెవరినీ తిట్టలేదని ఆమె తెలిపారు. అలాగే, తనపై ఏడాది కాలం సస్పెన్షన్ అనేది తీవ్రమైనదని ఆమె అన్నారు. ఒక సెషన్ కు పరిమితం చేయాల్సిన సస్పెన్షన్ ను ఏళ్లకేళ్లు విధిస్తూ పోతే, భవిష్యత్ లో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నానని ఆమె చెప్పారు. తమ పార్టీ అధినేత పలు మార్లు స్పీకర్ కు విన్నవించినా స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తోందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News