: షారూఖ్, సల్మాన్ లు ఎవరి మనోభావాలను గాయపరచలేదు: ఢిల్లీ పోలీసులు


బాలీవుడ్ నటులు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు ఎవరి మనోభావాలను గాయపర్చలేదని ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి తెలిపారు. 'బిగ్ బాస్ 9' షూటింగ్ సందర్భంగా వీరు షూలు ధరించి దేవాలయంలో ప్రవేశించి, హిందువుల మనోభావాలను గాయపరచారని పేర్కొంటూ ఓ న్యాయవాది ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. విచారణ వివరాలను పోలీసులు న్యాయస్థానానికి తెలియజేశారు. 'బిగ్ బాస్ 9'లో భాగంగా వేసిన 'కాళీమాత ఆలయం సెట్' షూటింగ్ లో మాత్రమే వీరు పాల్గొన్నారని, అంతేతప్ప, వారు ఏ దేవాలయంలోకి వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే వారు కావాలని షూ ధరించి షూటింగ్ లో పాల్గొనలేదని, షూటింగ్ లో భాగంగా అలా నటించారని వారు న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News