: సామాజిక మాధ్యమాల్లో రెహ్మాన్ తనయుడి పాట హల్ చల్!


ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కుమారుడు ఏఆర్ అమీన్ పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. గాయకుడిగా పరిచయమవుతున్న అమీన్ ప్రముఖ నటుడు నాగార్జున నిర్మిస్తున్న 'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఈ పాట పాడాడు. అమీన్ పాడిన ఈ డెబ్యూ సాంగ్ ప్రోమోను ఈరోజు విడుదల చేశారు. ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. కాగా, ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా; ‘జై చిరంజీవ’, ‘రోబో’, ‘దూకుడు’ వంటి సినిమాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.

  • Loading...

More Telugu News