: వెల్లింగ్టన్ టెస్టులో నిరాశపరిచిన మెక్ కల్లమ్


వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ తీవ్రంగా నిరాశపరిచాడు. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. అయితే టెస్టుల్లో అరంగేట్రం చేసిన నాటి నుంచి బ్రేక్ లేకుండా వంద టెస్టులు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్ తరువాత అన్ని రకాల అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి వైదొలగుతానని మెక్ కల్లమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెక్ కల్లమ్ విఫలం జట్టును ప్రభావితం చేసినట్టుంది. తొలి రోజే జట్టు మొత్తం పెవిలియన్ చేరింది. 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు, క్రెయిగ్ (41), కోరె ఆండర్సన్ (38), ట్రెంట్ బౌల్డ్ (24) రాణించడంతో 183 పరుగులు చేసింది. కాగా, కివీస్ పతనాన్ని నాలుగు వికెట్లతో హాజిల్ వుడ్, మూడేసి వికెట్లతో లయాన్, సిడెల్ లు శాసించారు.

  • Loading...

More Telugu News