: నాలుగేళ్లలో తెలంగాణలో 5వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది: పీయూష్ గోయల్
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్ల నాటికి 5వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్ర పీయూష్ గోయల్ తెలిపారు. ఢిల్లీలో ఇవాళ సీఎం కేసీఆర్ ఆయనను కలసి రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులపై మాట్లాడారు. తరువాత గోయల్ మీడియాతో మాట్లాడుతూ, రామగుండం ఎన్టీపీసీ ద్వారా 2020 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఖమ్మం జిల్లా మణుగూరులోని ప్లాంట్ ద్వారా రెండు సంవత్సరాల్లో 1,080 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు. తెలంగాణలో సోలార్ పార్కులు ఏర్పాటు చేయాలని కేసీఆర్ తనను కోరినట్టు గోయల్ చెప్పారు. అంతకుముందు కేసీఆర్ మాట్లాడుతూ, తామిచ్చిన ప్రతిపాదనలకు గోయల్ సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు.