: పరీక్షల్లో ఆ పదాలు రాస్తే డిబార్: యూపీ ప్రభుత్వం
పరీక్షలు రాసే విద్యార్థులు చాలా మంది ముందుగా దేవుడిని స్మరించుకుని రాయడం మొదలుపెడతారు. అందులో భాగంగా సమాధాన పత్రంలో ముందుగా ఓం, శ్రీరామ్, అవిఘ్నమస్తు, 786 వంటి పదాలను రాసి, ఆ తరువాత సమాధానాలు రాస్తుంటారు. అయితే, ఇకపై ఇలాంటి పదాలు సమాధాన పత్రం మీద రాస్తే వారిని డిబార్ చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఫిబ్రవరి 18 నుంచి ఉత్తరప్రదేశ్ బోర్డు ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనుంది. దీంతో విద్యార్థుల కుల, మత వివరాలు నిర్వాహకులకు తెలియకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అలాగే గ్యాడ్జెట్లు పరీక్షా హాలులోకి తీసుకురాకూడదని సూచించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పరీక్షల నుంచి శాశ్వతంగా డిబార్ చేస్తామని తెలిపింది.