: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే సరి-బేసి విధానమంటూ... హైకోర్టులో పిల్


దేశ రాజధాని ఢీల్లీ ప్రభుత్వం రెండోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేయాలనుకుంటున్న తరుణంలో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 1988 నాటి మోటారు వాహన చట్టం ప్రకారం, కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవచ్చని, అయితే, ఆ చట్టాన్ని సరిగ్గా అమలు చేయకుండా, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ సరి-బేసి విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఇదిలా ఉంచితే, ఈ ఏడాది జనవరిలో 15 రోజులు పాటు ప్రయోగాత్మకంగా సరి-బేసి విధానాన్ని అమలు చేయగా మంచి ఫలితాలిచ్చింది. దాంతో రెండోవిడతలో ఏప్రిల్ 15 నుంచి అమలు చేయాలని నిన్న(గురువారం)నే ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News