: కొత్తపుంతలు తొక్కుతున్న స్మగ్లింగ్...డిటర్జెంట్ ముసుగు
స్మగ్లింగ్ కు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూనే ఉన్నప్పటికీ, స్మగ్లర్లు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా డిటర్జెంట్ ముసుగులో స్మగ్లర్లు బంగారం అక్రమరవాణా మొదలు పెట్టారు. డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో 12 కేజీల బంగారం బిస్కెట్లు పెట్టి మలేసియా నుంచి శ్రీలంకలోని కొలంబో మీదుగా తమిళనాడులోని ట్యుటుకోరన్ పోర్టుకు పంపారు. స్మగ్లర్ల సూచన మేరకు అచ్చం అలాంటి కంటైనర్ ను సిద్ధం చేసి ఉంచిన రిసీవర్లు, ఆ కంటైనర్ ను తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇంతలో పోలీసులు వారి వ్యవహారాన్ని కనిపెట్టి, ఒరిజనల్ కంటైనర్ ను పట్టేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు.