: అనుబంధ విభాగాన్ని ఎక్కడైనా విలీనం చేస్తారా?: రావుల


టీటీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు సహా పలువురు ఎమ్మెల్యేలు స్పీకర్ కు లేఖ రాయడంపై తెలంగాణ టీడీపీ మండిపడుతోంది. తెలంగాణలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు జరుగుతున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలనడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారం పార్టీలను విలీనం చేస్తారు గానీ, అనుబంధ విభాగాన్ని విలీనం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే రాష్ట్రపతి వద్దకు వెళతామని చెప్పారు. ఇవాళ పార్టీ కార్యాలయంలో టీటీడీపీ నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు అనర్హత పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు టీటీడీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

  • Loading...

More Telugu News