: అమెరికా పోలీసు అధికారికి 15 ఏళ్ల జైలు శిక్ష
నల్లజాతి పౌరుడిపై అకారణంగా కాల్పులు జరిపిన కేసులో అమెరికాకు చెందిన పోలీసు అధికారికి పదిహేనేళ్ల జైలు శిక్షను న్యూయార్క్ కోర్టు విధించింది. పీటర్ లియాంగ్ అనే పోలీసు అధికారి అకాయి గుర్లే (28) అనే నల్లజాతి పౌరుడిపై కాల్పులకు పాల్పడటంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నవంబరు 20, 2014లో న్యూయార్క్ కు పొరుగున ఉన్న లూయిస్ హెచ్ పింక్ లో ఈ సంఘటన జరిగింది. దీంతో, నల్లజాతిపౌరులు తీవ్ర ఆందోళనలు కొనసాగించారు. ఇప్పుడు కోర్టు తీర్పు రావడంతో, తమకు న్యాయం జరిగిందంటూ గుర్లే తరపు వారు పేర్కొన్నారు.