: అప్పటికి అదే కరెక్ట్: వార్న్ విమర్శలపై స్పందించిన స్టీవ్ వా


తనను 1999లో వెస్టిండీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్ నుంచి అన్యాయంగా తొలగించాడంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వాపై బౌలర్ షేన్ వార్న్ తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో స్టీవ్ వా వివరణ ఇచ్చాడు. అప్పట్లో జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించిన మీదటే, కెప్టెన్ గా తన పని తాను చేసుకుపోయానని, వార్న్ పై వ్యక్తిగత కోపమేమీ లేదని చెప్పాడు. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తప్పవని అభిప్రాయపడ్డ 'వా', జట్టులోని ఏ ఆటగాడిని తొలగించాలన్నా అది చాలా క్లిష్టమైన అంశమేనని అన్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా, దేశ ప్రయోజనాలు, జట్టు గెలుపే ముఖ్యమని తెలిపాడు. ఆనాటి తన నిర్ణయం సరైనదేనని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News