: పాసయ్యావ్... కంగ్రాట్స్, సెరెమనీ ఈజ్ గ్రేట్: ముంబై దాడుల తర్వాత హెడ్లీకి సతీమణి సందేశం


ముంబై మారణ హోమం గురించి ఆ దారుణంలో కీలక పాత్ర పోషించిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ భార్య ఫాయిజాకు ముందే తెలుసట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. గడచిన నాలుగు రోజులుగా అమెరికా నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని కోర్టు విచారణకు హాజరైన సందర్భంగా హెడ్లీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాడు. ఇందులో భాగంగా నేటి విచారణలో దాడులకు సంబంధించిన సమాచారం తన భార్యకు ముందే తెలుసని అతడు కోర్టుకు చెప్పాడు. దాడులు ముగియగానే తనను అభినందిస్తూ తన భార్య సందేశం పంపిందని కూడా అతడు చెప్పాడు. ‘‘పాసయ్యావ్. అభినందనలు. సెరెమనీ ఈజ్ గ్రేట్’’ అంటూ తన భార్య తనకు ఈ మెయిల్ సందేశం పంపిందని హెడ్లీ తెలిపాడు. ఇక తనతో విడాకులు తీసుకున్న ఫాయిజా, తిరిగి తమను కలపమని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ను అభ్యర్థించిందని, ఈ విషయంలో సయీద్ తనతో మాట్లాడాడని కూడా హెడ్లీ తెలిపాడు.

  • Loading...

More Telugu News