: మిషన్ కాకతీయ, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి మోదీకి కేసీఆర్ ఆహ్వానం
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. దాదాపు అరగంటకు పైగా వారి భేటీ జరిగింది. తెలంగాణకు సంబంధించిన ఆర్థిక అంశాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చించారు. మిషన్ కాకతీయ, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఈ సందర్భంగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు. ఇందుకాయన సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. గతేడాది చివర్లో చండీయాగం నిర్వహించే ముందు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మంత్రులందరినీ కలసి ఆహ్వానించి వచ్చారు. కానీ మోదీ అపాయింట్ మెంట్ మాత్రం దొరకలేదు. ఈసారి మూడు రోజుల పర్యటనలో భాగంగా ముందు మోదీనే కలసి పలు విషయాలపై చర్చించడం గమనార్హం.