: విశాఖ స్మార్ట్ సిటీలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉంది: యూఎస్ రాయబారి


విశాఖపట్టణం స్మార్ట్ సిటీలో భాగస్వామ్యమవడం చాలా సంతోషంగా ఉందని అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ అన్నారు. భారతదేశంలో మొత్తం 3 నగరాలకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. విశాఖ స్మార్ట్ సిటీ అంశంపై గీతం యూనివర్సిటీలో నిర్వహించిన ఏపీ-యూఎస్ భాగస్వామ్య సదస్సులో విద్యార్థులతో ఈ మేరకు ఆయన మాట్లాడారు. స్మార్ట్ సిటీ నిర్మాణంలో 20 అమెరికా సంస్థల భాగస్వామ్యం ఉంటుందని, ట్రాఫిక్ భద్రత, ఆరోగ్య రంగాల్లో కూడా సహకారం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ స్మార్ట్ సిటీ భాగస్వామ్యంపై ఇవాళ సీఎం చంద్రబాబుతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News