: హనుమంతప్పకు అరుదైన గౌరవం... ప్రభుత్వ ట్విట్టర్ ఖాతాలో వాల్ పేపర్!


వీర సైనికుడు, భరతమాత ముద్దుబిడ్డ, సియాచిన్ మంచు కొండల్లో ఆరు రోజుల పాటు ప్రాణాలను నిలుపుకొని, ఆపై మరో మూడు రోజులు మృత్యువుతో పోరాడి అసువులు బాసిన హనుమంతప్పకు అరుదైన గౌరవం లభించింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలో ఉండే ప్రభుత్వ చిహ్నం స్థానంలో హనుమంతప్ప చిత్రాన్ని వాల్ పేపర్ గా ఉంచారు. "వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప మరణం నా మనసును తీవ్రంగా కలచివేస్తోంది. ఆయన కుటుంబం ఈ బాధ నుంచి బయటపడి నిలబడాలని కోరుకుంటున్నాను" అని అరుణ్ జైట్లీ ట్యాగ్ లైన్ ఉంచారు. కాగా, హనుమంతప్ప మృతదేహం ఇప్పటికే కర్ణాటకలోని ఆయన స్వగ్రామానికి చేరుకోగా, నేడు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News