: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అగాధం సృష్టించిన 'రాకెట్'!


ఉత్తర కొరియా ప్రయోగించిన విస్తృతస్థాయి రాకెట్ ప్రయోగం రెండు కొరియాల మధ్య అగ్గిరాజేసింది. రాకెట్ ప్రయోగం జరగగానే రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కైసాంగ్ వాణిజ్య పార్క్ ను మూసేస్తున్నట్టు దక్షిణ కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియా నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఉత్తర కొరియా స్పందించి, ఇంకో ప్రకటన జారీ చేసింది. వాణిజ్య పార్క్ లో ఉంటున్న దక్షిణ కొరియా వాసులంతా ఉన్నపళంగా దేశం వీడాలని ఆదేశించింది. వ్యక్తిగత సామాన్లు మినహా ఇంకేవీ తీసుకెళ్లకూడదని, ఇండస్ట్రియల్ సామగ్రి మొత్తాన్ని సీజ్ చేస్తున్నట్టు, ఆ ప్రాంతాన్ని సైనిక జోన్ గా మారుస్తున్నట్టు ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య అగాధం మరింత పెరిగింది.

  • Loading...

More Telugu News