: దిగివచ్చిన మార్క్ ఆండ్రీసేన్... భారతీయులకు క్షమాపణలు!


ఫేస్ బుక్ ప్రతిపాదించిన ఫ్రీబేసిక్స్ కు వ్యతిరేకంగా, నెట్ న్యూట్రాలిటీని సమర్థిస్తూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై ఫేస్ బుక్ బోర్డ్ సభ్యుడు మార్క్ ఆండ్రీసెన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. భారత్ పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకమని, బ్రిటిషర్ల చేతిలో ఉండి ఉంటే భారత్ మరింత బాగుండేదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేయడానికి తోడు...భారత్ లో ఫేస్ బుక్ ను నిషేధించాలనే డిమాండ్ లేవనెత్తారు. దీనిపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ ఆ వ్యాఖ్యలు తనను కూడా బాధించాయని పేర్కొన్నారు. అయినప్పటికీ భారతీయ నెటిజన్లలో ఆగ్రహం చల్లారలేదు. ఫేస్ బుక్ కి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో ఆండ్రీసెన్ దిగివచ్చాడు. భారత రాజకీయాలు, చరిత్ర గురించి గతంలో తాను చేసిన ట్వీట్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరాడు. భారత్ ను, భారత ప్రజలను ఎంతో ప్రశంసిస్తానని ఆయన ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News