: ఐసిస్ మరోదారుణం...పిల్లాడితో కారు బ్లాస్ట్ చేయించారు!
ఐఎస్ఐఎస్ దారుణాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. అత్యంత పాశవికంగా మనుషులను హత్య చేస్తూ, 'ఇదంతా దేవుడికోసం చేస్తున్నాం' అని చెప్పుకుంటున్న ఐసిస్ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో చిన్న పిల్లలను పాషాణ హృదయులుగా ఎలా మార్చుతున్నారో చూపడం విశేషం. ఓ బాలుడు...గూఢచర్యం ఆరోపణలతో కారులో బందీలుగా చేయబడ్డ ముగ్గురు వ్యక్తులను డిటోనేటర్ తో పేల్చేయడం ఈ వీడియోలో దర్శనమిస్తుంది. ఈ వీడియోలో కనిపించే బాలుడిపేరు ఇసా దారే అని అతని పక్కన ఉన్న ఐఎస్ఐఎస్ ముష్కరుడు పేర్కొన్నాడు. కాగా, ఈ బాలుడు గతంలో కూడా పలు వీడియోల్లో కన్పించాడు. ఈ ఘటన అనంతరం ఆ ఉగ్రవాది బ్రిటిష్ యాసలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరాన్ ను హెచ్చరించాడు.