: వేటపాలెంలో ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులు, పోలీసుల మధ్య వివాదం


ప్రకాశం జిల్లా వేటపాలెంలో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ చోరీ కేసులో నిన్న (బుధవారం) పూర్ణచందర్ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారంచేడు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. తరువాత అతను మృతి చెందడంతో... ఇవాళ ఆ మృతదేహాన్ని పోలీసులు వేటపాలెంకు తరలించారు. పోలీసులు కొట్టడం వల్లే అతను మృతి చెందాడంటూ ఆమంచి వర్గీయులు, పోలీసులతో గొడవకు దిగారు. ఆ వివాదం ముదిరి, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో ఎమ్మెల్యే ఆమంచిని అరెస్టు చేసి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. కానీ ఆయన వాహనం నుంచి తప్పించుకొని వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News