: గుంటూరు ఇసుక రేవుల వేలంతో ఏపీ ప్రభుత్వానికి రూ.27.44 కోట్ల ఆదాయం
గుంటూరు జిల్లాలోని ఇసుక రేవులకు నిర్వహించిన వేలంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.27.44 కోట్ల ఆదాయం లభించింది. జిల్లాలోని మొత్తం 7 రేవులకు ప్రభుత్వ అధికారులు ఈ-వేలం నిర్వహించారు. గుండిమెడ రేవుకు రూ.2.13 కోట్లు, జువ్వల రేవుకు రూ.2.72 కోట్లు, కస్తర రేవుకు రూ.8.48 కోట్లు, కోనూరు రేవుకు రూ.7.31 కోట్లు, పోతరలంక రేవుకు రూ.2.06 కోట్లు, వల్లభాపురం రేవుకు రూ.2.39 కోట్లు, ఉద్ధండరాయుని పాలెం రేవుకు రూ.2.32 కోట్లు వచ్చింది.