: కోహ్లీ కంటే దూకుడెక్కువ...డీకాక్ దూసుకొస్తున్నాడు!


బ్యాటు చేతబట్టి క్రీజులో దిగిన తరువాత కోహ్లీ దూకుడుకు తిరుగుండదని క్రికెట్ అభిమానులు ఎవరినడిగినా చెబుతారు. అంతెందుకు, సచిన్ సెంచరీల రికార్డు బద్దలుగొట్టే సత్తా ఉన్న ఏకైక ఆటగాడు కోహ్లీ అని విశ్లేషకులు కూడా పేర్కొంటుంటారు. అయితే కోహ్లీ కంటే దూకుడైన ఆటగాడు చాపకింద నీరులా దూసుకొస్తున్నాడు. డివిలియర్స్, అమ్లా, మిల్లర్, డుమిని వంటి వారి చాటున ఎదుగుతున్న సఫారీ ఓపెనర్ డీకాక్ సంచరీల మీద సెంచరీలు చేసుకుంటూ తానేమీ తక్కువ కాదని చాటి చెబుతున్నాడు. అత్యంత వేగవంతమైన పది సెంచరీలు చేసిన ఆటగాడిగా డీకాక్ నిలిచాడు. అది కూడా, కేవలం 50 వన్డేలలో డీకాక్ పది సెంచరీలు చేయడం విశేషం. పది సెంచరీలు చేసేందుకు కోహ్లీకి 80 ఇన్నింగ్స్ అవసరం అవగా, డీకాక్ 57 ఇన్నింగ్స్ లో పది సెంచరీలు నమోదుచేసి, ఆమ్లా పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. దీంతో సఫారీ జట్టులో చాపకిందనీరులా డీకాక్ దూసుకువస్తున్నాడని, కోహ్లీ కంటే వయసులో చిన్నవాడైన డీకాక్ కు రికార్డులు తిరగరాసే సత్తా ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News