: చంద్రబాబు అధ్యక్షతన టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశం


టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలంగాణ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి ఎల్.రమణ, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, గాంధీ, మాగంటి గోపీనాథ్, రాజేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, రావుల చంద్రశేఖర్, మోత్కుపల్లి నర్సింహులు, ఉమా మాధవరెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే ఆ పార్టీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాత్రం హాజరుకాలేదు. గ్రేటర్ ఎన్నికల తరువాత ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో ఇవాళ అత్యవసరంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరికొంతమంది కూడా గులాబీ దళంలోకి వెళతారన్న నేపథ్యంలో పార్టీ పరిస్థితిపై విస్తృతంగా సమీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News