: టీటీడీపీలో మిగిలిన వారు కూడా త్వరలో టీఆర్ఎస్ లోకి వచ్చేస్తారు: టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణ తెలుగుదేశంలో మిగిలివున్న మిగతా ఎమ్మెల్యేలు త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇప్పటికే దాదాపు టీడీపీ ఖాళీ అయిపోయిందని, రేవంత్ రెడ్డి వంటి ఒకరిద్దరు ఐరన్ లెగ్ లు మాత్రమే అక్కడ ఉన్నారని ఎద్దేవా చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, రేవంత్ రెడ్డి టీడీపీలో చేరిన తరువాత ఆ పార్టీకి అన్నిటా అపజయాలే ఎదురయ్యాయని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు మినహా మరో రాజకీయ పార్టీ మనుగడకు అవకాశాలు కనిపించడం లేదని అన్నారు.