: ఇండియాను మూడో ర్యాంకుకు తగ్గించిన లంకేయులు!


ఆస్ట్రేలియాలో టీట్వంటీ సిరీస్ లో ఆసీస్ ను మట్టికరిపించి వరల్డ్ నెంబర్ వన్ గా స్వదేశం చేరిన భారత జట్టును లంకేయులు ఘోరమైన దెబ్బకొట్టారు. అనుభవం లేదు, స్వదేశం కాదు, నాణ్యమైన జట్టు కాదు అని విమర్శలు చేసిన వారికి సమాధానమిస్తూ, భారత జట్టును అవలీలగా తొలి టీట్వంటీలో శ్రీలంక జట్టు ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు వరల్డ్ టీట్వంటీ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయి నెంబర్ త్రీగా మారింది. దీంతో టీమిండియా లంకేయులను ఇప్పుడు సీరియస్ గా తీసుకుంది. రాంచీ వేదికగా జరగనున్న రెండో టీట్వంటీలో సత్తాచాటాలని భావిస్తోంది. అయితే, బ్యాటింగ్ వైఫల్యం జట్టును ఓటమిపాలు చేసిందన్న సంగతిని జట్టు గుర్తించింది. దీంతో రెండో టీట్వంటీలో లంక యువ బౌలర్లకు ముకుతాడు వేయాలని టీమిండియా టాపార్డర్ భావిస్తోంది. త్వరలో వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ గా లంకను అడ్డుకోవాలంటే అంతకంటే ముందే ఆ జట్టును ఓటమితో దెబ్బకొట్టాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. తద్వారా వరల్డ్ కప్ కు సరిపడా మానసిక స్థైర్యం సంతరించుకోవాలని టీమిండియా భావిస్తోంది.

  • Loading...

More Telugu News