: అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ తో వెస్టిండీస్ 'ఢీ'
ఇండియా, వెస్టిండీస్ మధ్య అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ పోరు ఖరారైంది. బంగ్లాదేశ్ తో జరిగిన సెమీఫైనల్లో వెస్టిండీస్ జట్టు జయకేతనం ఎగురవేయడంతో ఆ జట్టు ఫైనల్ కి చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 226 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టులో స్ప్రింగర్ (59) రాణించడంతో 48.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. దీంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విండీస్ జట్టు ఫైనల్లో ప్రవేశించింది. టోర్నీలో టైటిల్ ఫేవరేట్ భారత జట్టు ఇప్పటికే ఫైనల్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 14న ఫైనల్ ఫైట్ జరగనుంది.