: దర్శకుడు రాజమౌళికి కోర్టు సమన్లు... 24న హాజరు కావాలని ఆదేశం


ప్రముఖ దర్శకుడు రాజమౌళికి నేడు కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. ఓ రియల్ ఎస్టేట్ లావాదేవీ వ్యవహారంలో రాజమౌళి మోసం చేశాడని, భువనేశ్వర్ అనే నిర్మాత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ సమన్లు జారీ అయ్యాయి. తనకు ప్లాటు అమ్ముతానని చెప్పిన రాజమౌళి ఆపై మోసం చేశారన్నది భువనేశ్వర్ మోపిన అభియోగం. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు ఈ 24న విచారణకు హాజరు కావాలని రాజమౌళిని ఆదేశించింది. కాగా, ఈ విషయమై స్పందించేందుకు జక్కన్న అందుబాటులో లేడు. కేసును గురించిన మరింత సమాచారం తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News