: రెజ్లింగ్ నేర్చుకుంటున్న అనుష్క శర్మ
బాలీవుడ్ సుందరి అనుష్క శర్మ తన కొత్త చిత్రం 'సుల్తాన్' కోసం చెమటోడుస్తోంది. ఈ చిత్రంలో భాగంగా తన పాత్ర కోసం ప్రత్యేకంగా రెజ్లింగ్ లో శిక్షణ తీసుకుంటోంది. బ్లూ షర్ట్, బ్లాక్ షార్ట్ వేసుకుని రింగ్ లో కోచ్ దగ్గర రెజ్లింగ్ నేర్చుకుంటుండగా తీసిన ఫోటోలను అనుష్క ట్విట్టర్ లో పోస్టు చేసింది. 'నో పెయిన్ నో గెయిన్, సో జస్ట్ ట్రైన్' అంటూ ట్వీట్ చేసింది. యశ్ రాజ్ ఫిల్మ్ బ్యానర్స్ పై అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ఈ 'సుల్తాన్' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రెజ్లర్ గా నటిస్తున్నాడు.