: ఏ చట్టం కింద కోహినూర్ ను పాక్ కు తీసుకురావాలి?: పిటిషనర్ కు న్యాయస్థానం ప్రశ్న


కోహినూర్ వజ్రాన్ని ఏ చట్టం ప్రకారం పాకిస్థాన్ కు తీసుకురావాలని పిటిషనర్ ను లాహోర్ హైకోర్టు ప్రశ్నించింది. తమ ప్రశ్నకు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఆదేశించింది. బ్రిటన్ లో ఉన్న కోహినూరు వజ్రం పాకిస్థాన్ కు చెందినదని, దానిని అధికారులు తిరిగి పాకిస్థాన్ కు తీసుకురావాలని జావెద్ ఇక్బాల్ అనే న్యాయవాది లాహోర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోహినూరు వజ్రాన్ని భారత్ కు ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించిందని, పాక్ అధికారులు దానిని పాకిస్థాన్ కు తీసుకురావాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఏ చట్టం ప్రకారం కోహినూర్ ను పాక్ కు తీసుకురావాలో రెండు వారాల్లో చెప్పాలని ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 25కి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News