: గుర్గావ్ లో స్నాప్ డీల్ ఉద్యోగిని కిడ్నాప్


గుర్గావ్ లోని స్నాప్ డీల్ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని కిడ్నాప్ అయింది. ఈ మేరకు తమ ఉద్యోగిని ఒకరు కిడ్నాప్ అయినట్టు స్నాప్ డీల్ వ్యవస్థాపకుడు కునాల్ బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉద్యోగిని కనిపించని విషయాన్ని ఆయన ట్విట్టర్ లో కూడా పేర్కొన్నారు. దీప్తీ సార్నా అనే ఆ యువతి ప్రతిరోజూ తన ఆఫీసు పని ముగియగానే మెట్రోరైలు ద్వారా ఘజియాబాద్ వెళుతుంది. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళుతుంటుంది. కానీ నిన్న(బుధవారం) సాయంత్రం ఇంటికి వెళ్లలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే స్నాప్ డీల్ యాజమాన్యమే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News