: హైదరాబాదు అంతటా లక్ష సీసీ కెమెరాలు: 'సీపీ' మహేందర్ రెడ్డి


హైదరాబాదు అంతటా లక్ష సీసీ కెమెరాలు అమర్చనున్నామని నగర పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో సీసీ టీవీ ప్రాజెక్టును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని టైటాన్ ఐ షోరూం నుంచి చింతల్ బస్తీ వరకు 22 లక్షల రూపాయలతో 36 సీసీ కెమెరాలను అమర్చినట్టు తెలిపారు. ఈ మొత్తాన్ని 43 మంది దాతలు విరాళంగా అందజేసినట్టు ఆయన వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే ఏడాది నాటికి లక్ష సీసీ కెమెరాలను హైదరాబాదు వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నామని ఆయన అన్నారు. ట్రాఫిక్ పోలీస్ రహిత సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానున్నామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News