: తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై ప్రముఖులతో భేటీ
తెలంగాణ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించడానికి మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాదులోని సచివాలయంలో సమావేశమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, సినీరంగ ప్రముఖులు దాసరి నారాయణరావు, 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, అశోక్ కుమార్, కేఎస్ రామారావు, ఆర్.నారాయణమూర్తి తదితరులు హాజరయ్యారు. సినీ రంగం ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రధానంగా వారు చర్చిస్తున్నారు.