: అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?: మాగంటి గోపీనాథ్ సూటి ప్రశ్న


ఓటుకు నోటు కుంభకోణంలో తన పాత్ర ఉందని తేలితే...రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన తరువాత జరిగిన విచారణ సందర్భంగా తనను ఎందుకు అరెస్టు చేయలేదని టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కుంభకోణంలో ఈయనను అరెస్టు చేస్తారని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ, తాను తప్పు చేసి ఉంటే కనుక ఎప్పుడో చర్యలు తీసుకుని ఉండేవారని అన్నారు. తనను పార్టీ మారమని ప్రోత్సహించారని, తాను టీడీపీతోనే ఉంటానని తేల్చిచెప్పడంతో తనపై లేనిపోని ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని, తద్వారా తనను ఒత్తిడిలోకి నెట్టి పార్టీ మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ప్రచారాలకు బెదిరిపోయే మనిషిని కాదని, టీఆర్ఎస్ వ్యూహాలను ఎదుర్కొనే సామర్థ్యం తనకు ఉందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News