: మా జిల్లాను కాస్త చూసుకోండి... కేంద్ర రవాణా మంత్రితో బాలకృష్ణ
ఢిల్లీ పర్యటనలో ఉన్న హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఆయనతో కాసేపు భేటీ అయిన బాలయ్య, రహదారుల విషయంలో వెనుకబడిన అనంతపురం జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. త్వరలో జరిగే లేపాక్షి ఉత్సవాలకు గడ్కరీని ఆహ్వానించేందుకు వచ్చానని భేటీ అనంతరం బాలకృష్ణ మీడియాకు తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరించాలన్న తన విజ్ఞప్తికి గడ్కరీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి, మరమ్మతులకు తగిన నిధులివ్వాలని కోరినట్టు పేర్కొన్నారు.