: వీర సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కన్నుమూత


వీర జవాను లాన్స్ నాయక్ హనుమంతప్ప తుదిశ్వాస విడిచాడు. ఢిల్లీలోని రీసెర్చ్ రిఫెరల్ ఆర్మీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని ప్రాణాలు కాపాడడానికి గత మూడు రోజుల నుంచి ఆసుపత్రి వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమై కోమాలోకి వెళ్లిన ఆ జవాను మృత్యుఒడికి చేరాడు. ఇటీవల జమ్ముకశ్మీర్ లోని వ్యూహాత్మక సైనిక స్థావరం సియాచిన్ మంచుతుపానులో 25 అడుగుల లోతులో హనుమంతప్ప కూరుకుపోయాడు. రెస్క్యూ ఆపరేషన్ చేబట్టిన సైనికులు ఆరు రోజుల తర్వాత మంచుచరియల కింద అతను ప్రాణాలతో ఉండడాన్ని గుర్తించి, వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతని కిడ్నీ, లివర్ పాడవడంతో ఆరోగ్యం విషమించింది. దాంతో ఈ ఉదయం 11.40 నిమిషాలకు ప్రాణాలొదిలాడు.

  • Loading...

More Telugu News