: టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న టీడీపీ ఎమ్మెల్యే


కరీంనగర్ టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 'మా పార్టీలోకి రండి దయచేయండి' అంటూ టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పంపిన ఆహ్వానానికి గంగుల ఆకర్షితులయ్యారు! నేడు కరీంనగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గంగులకు కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 'కదనభేరి' పేరిట నిర్వహించిన ఈ సభలో గంగులతోపాటు పలువురు మాజీ సింగిల్ విండో చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు టీఆర్ఎస్ లో చేరారు. గంగుల కొద్దిరోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలకు దిగడమే కాకుండా పార్టీపైనా పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News