: మోదీ పాస్ పోర్టు వివరాలు తెలపాలంటూ... ఆయన భార్య జశోదా బెన్ దరఖాస్తు


ప్రధానమంత్రి నరేంద్రమోదీ భార్య జశోదాబెన్ సమాచార హక్కు చట్టం కింద అహ్మదాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి ఓ దరఖాస్తు చేశారు. తన భర్త మోదీ పాస్ పోర్టులోని వివరాలు తెలపాలంటూ అందులో కోరారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితులను కలిసేందుకు వెళ్లాలని జశోదాబెన్ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. ఈ క్రమంలో గతేడాది నవంబర్ లో ఆమె పాస్ పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెళ్లి సర్టిఫికెట్ ఇవ్వని కారణంగా పాస్ పోర్టు ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన సోదరుడు అశోక్ మోదీ, మరో బంధువుతో కలసి ఆటోలో వచ్చారని, మోదీ పాస్ పోర్టు కాపీలను ఇవ్వాలంటూ పాస్ పోర్టు కార్యాలయ అధికారులను కోరారని సమాచారం. అయితే ఆమె దరఖాస్తును పరిశీలిస్తున్నామని, ఒక నెల రోజుల్లో సమాధానమిస్తామని ఆర్ పీఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News