: 'గుండె పగిలి ఎంత బాధగా ఉందో'... అంటున్న కోహ్లీ, పోస్ట్ చేసిన పిక్చర్ ఇదే!
నిన్నటి వరకూ విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మల బంధం తెగినట్టు అధికారికంగా వారిద్దరి నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు. నేడు కోహ్లీ తమ బంధం తెగిపోయిందన్న సంకేతాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెలిబుచ్చాడు. తన గుండె పగిలిపోయిందని చెబుతూ, బాధగా చూస్తున్న ఓ చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఆపై కాసేపటికి దాన్ని డిలీట్ చేసిన కోహ్లీ, తిరిగి మనసు మార్చుకున్నాడు. "నేను బాధతో ఉన్న చిత్రాన్ని డిలీట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తున్నాను. నన్ను మన్నించండి. ఆ చిత్రాన్ని తిరిగి ఉంచుతున్నాను. నేను బాధతోనే ఉన్నాను" అంటూ అదే చిత్రాన్ని రీ పోస్ట్ చేశాడు. ఈ చిత్రానికి 81 వేలకు పైగా లైక్స్ రాగా, 2,230 మంది కామెంట్లు చేయడం గమనార్హం. ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.