: ఇండియాది 'వలసవాద భావజాలం' అంటూ ఫేస్ బుక్ అక్కసు... నెటిజన్ల ఫైర్!
నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తీసుకున్న నిర్ణయాన్ని భరించలేని ఫేస్ బుక్ తన అక్కసు వెళ్లగక్కుతోంది. ఇండియాది 'వలసవాద భావజాలం' అంటూ ఫేస్ బుక్ బోర్డు మెంబర్ మార్క్ అండ్రీసేన్ ఓ ట్వీట్ చేయగా, భారత నెటిజన్లు దాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ ట్వీట్ ఇప్పుడు రీట్వీట్స్ తో హోరెత్తుతోంది. భారత ప్రజలకు ట్రాయ్ తీసుకున్న నిర్ణయం ఉపయోగపడదని, దేశాభివృద్ధి దశాబ్దాల వెనక్కు వెళ్లిపోయిందని ఆండ్రీసేన్ అనగా, అసలు ఫేస్ బుక్ నే ఇండియా నుంచి బ్యాన్ చేస్తామని వేలాది మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటి పాలకుల కన్నా బ్రిటిష్ హయాంలోనే మంచి నిర్ణయాలు వెలువడ్డాయని కూడా ఆయన అన్నారు. ఆపై నెటిజన్ల నుంచి వచ్చిన వ్యతిరేకతతో తన ట్వీట్ ను ఉపసంహరించుకోగా, ఆండ్రీసేన్ పై ఇంకా విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.