: తప్పుడు వార్తలు రాసిన పత్రికపై రూ. 100 కోట్ల దావా వేయనున్న ధోనీ!


రెండేళ్ల క్రితం మాంచెస్టర్ లో భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన టెస్టు క్రికెట్ పోటీలో ధోనీ మ్యాచ్ ఫిక్సింగ్‌ చేశాడని అప్పట్లో జట్టుకు మేనేజర్‌ గా ఉన్న సునీల్‌ దేవ్‌ వ్యాఖ్యానించినట్టు వార్తను ప్రచురించిన పత్రికపై మహేంద్ర సింగ్‌ ధోని దావా వేశాడు. ముందుగా జట్టు తీసుకున్న నిర్ణయాన్ని కాదని, టాస్ గెలిచిన ధోనీ, తరువాత అకస్మాత్తుగా బౌలింగ్ ఎంచుకోవడం వల్లే భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని సునీల్ చెప్పినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సునీల్ తానీ వ్యాఖ్యలు చేయలేదని ఖండించారు కూడా. ఇప్పుడు దీనిపై ఆ పత్రికకు 9 పేజీల నోటీసు పంపినట్టు ధోనీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. రూ. 100 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

  • Loading...

More Telugu News